కూలిన ప్రహారీ గోడ.. తండ్రీ, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/75263950/photo-75263950.jpg)
వేసవి కావడంతో చల్లగాలి కోసం బయట కూర్చున్న కుటుంబం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహారీ గోడ నేలమట్టం కావడంతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులో విషాదం నింపింది. శివారు తాంబరం సమీపంలోని పీక్కన్ కరణై ముత్తమిళ్ వీధి శ్రీనివాస నగర్‌కు చెందిన రాజాంగం(60) పెయింటర్. ఆయన ఆదివారం రాత్రి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో తన కుమార్తెలు కళ(40), సుమిత్ర(32)తో మంచంపై కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ గోడ ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఆ గోడ గాలికి కూలి మంచంపై పడింది. శిథిలాల కింద ఆ ముగ్గురు చిక్కుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: కాసేపటికే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురిని శిథిలాల నుంచి వెలికి తీశారు. 108 అంబులెన్స్‌లో క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజాంగం ప్రాణాలు కోల్పోగా.. కళ, సుమిత్ర చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. గోడ నేలమట్టం కావడంతో తండ్రి, కుమార్తెలు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నింపింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టడం వల్లే ప్రహారీ గోడ కుప్పకూలిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా కాపాడుకునేందుకు యజమానులు భారీగా ప్రహారీ గోడలు నిర్మించి, పర్యవేక్షణ పట్టించుకోవడం లేదని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By April 21, 2020 at 09:27AM
No comments