‘KCR ప్రెస్ మీట్‌లో పెగ్గేయాలి’.. వర్మ ఛాలెంజ్‌తో ఇరకాటంలో యాంకర్
అంతే.. అంతే.. మననోటి వెంట తాగుబోతు కబుర్లు తప్పితే మంచి మాటలు ఎలా వస్తాయ్‌లే.. అందులోనూ రాత్రి అయితే వోడ్కా మన నోటి నుంచి బుసలు కొడుతుంటుంది. ఏం మాటలు వస్తాయో.. అసలు ఏం మాట్లాడతామో కూడా తెలియదు. లేకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో మందు కొట్టాలా?? ఏందయ్యా వర్మా.. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కూడా నోటికి హద్దు, అదుపు లేకపోతే ఎట్టా. అయినా దూలగుండ చెట్టుకి రేగుపళ్లు కాస్తాయని అనుకోవడం అవివేకం కాని వర్మ నుంచి ఇలాంటి మాటలు తప్ప మంచి మాటల్ని ఊహించుకోవడం తప్పేలే. సరే ఇక అసలు విషయానికి వస్తే.. కరోనా వర్మ అంటూ గత రాత్రి ఎన్టీవీలో వర్మతో డిస్కషన్ పెట్టారు యాంకర్ రుషి. అల్రెడీ వర్మ ఇంటర్వ్యూలతో అనుభవం ఉన్న ఆ యాంకర్.. పోయి పోయి వర్మను ఏదైనా ఛాలెంజ్ విసుతారా?? ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది కదా.. ఈ లాక్ డౌన్ పిరియడ్‌లో మీరు ఎవరికైనా ఛాలెంజ్ ఇవ్వాల్సి వస్తే.. ఎవరికి ఇస్తారు? ఏం ఇస్తారు? అని యాంకర్ అడిగాడు. దీనికి వర్మ మొదట చాలా సాఫ్ట్‌గానే.. నేను ఎవరి మాట వినను.. నేను ఎవరికీ నా మాట వినమని చెప్పను. అలాంటప్పుడు నేను ఛాలెంజ్ విసరడం కాని పని అని చెప్పేశారు. అయితే ఆ యాంకర్ ‘మీరు మారరా’ ఇక అని అనడంతో వర్మలో ఉన్న రెండో యాంగిల్ బయటకు వచ్చింది. ‘ఏం మారాలి.. పోని మీరు చెప్పండి.. నేను ఏం ఛాలెంజ్ ఇవ్వాలో’ అంటూ తిరిగి యాంకర్‌ని వర్మ ప్రశ్నించడంతో నీళ్లునమిలాడు యాంకర్. వద్దులెండి వర్మ గారు.. నేను ఛాలెంజ్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోరు.. అదే వర్మ చాలెంజ్ ఇస్తే పెద్ద న్యూస్ అవుతుంది. ప్రస్తుతం మీరు పవన్ కళ్యాణ్‌కి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి అని అనుకుందా.. ఏం ఇస్తాం అని ఆ యాంకర్ కాస్త అత్యుత్సాహం చూపించారు. దీంతో వర్మ.. సర్లే పవన్ కళ్యాణ్ ఎందుకులే కాని ఈ లాక్ డౌన్ పిరియడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్‌లో అందరి ముందు కూర్చుని ఒక గ్లాస్ విస్కీ తాగమని నా ఛాలెంజ్.. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ఆల్కహాల్ లేకుండా చచ్చిపోతున్నారు. వాళ్లందరూ ఈయన పెగ్ వేస్తుంటే కుళ్లుకుని చచ్చిపోయేలా కేసీఆర్ వీస్కీ తాగాలని ఛాలెంజ్ చేశారు వర్మ. ఇక వర్మ ఛాలెంజ్‌కి ఖంగుతిన్న ఆ యాంకర్.. ‘నేను మిమ్మల్ని ఛాలెంజ్ అడిగి పెద్ద రిస్క్ చేసినట్టు ఉన్నాను సార్.. నేను ఏదో మిమ్మల్ని ఛాలెంజ్ అడిగితే మీరు తీసుకుని వెళ్లి కేసీఆర్ గారికి పెట్టారు.. అది కూడా విస్కీ తాగమంటున్నారు’ అంటూ చేసిన తప్పును తరువాత తెలుసుకున్నారు. ‘అందర్నీ తాగొద్దని.. ఆయన ప్రెస్ మీట్‌లో కూర్చుని తాగుతున్న విజువల్.. దానికి ప్రజల రియాక్షన్ చూసి వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే అదిరిపోద్ది’ అంటూ వర్మ తన ఆలోచననను బయటపెట్టాడు. ఇంతకీ వర్మ గారు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి?? మందు షాపులు ఓపెన్ చేయాలని అంటున్నారా? అని తిరిగి ఆ యాంకర్ అడగ్గా.. ‘ఓపెన్ చేయమని కాదు.. ఓపెన్ చేయమని అడుగుతున్న వాళ్లకి కనిపించేలా కేసీఆర్ మందు కొడితే వాళ్లకి కేసీఆర్ పెద్ద విలన్‌గా కనిపిస్తారు అని అంటున్నా.. ఆ బాధలో కరోనాను మర్చిపోతారనే ఉద్దేశంతో నేను ఈ కామెంట్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.
By April 21, 2020 at 09:50AM
No comments