ఇళ్లు ఖాళీ చేయడం లేదని దారుణం.. దంపతులపై ఇంటి యజమాని దాడి
ఇల్లు ఖాళీ చేసే విషయంలో తలెత్తిన వివాదం దంపతులపై దాడికి దారితీసింది. యజమాని తమపై దాడికి పాల్పడ్డాడని దంపతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జిల్లా గుత్తిలో జరిగింది. గుత్తిలోని ఆర్ఎస్ ఎమ్మార్ రోడ్డులో గల తిరుమలరెడ్డి ఇంట్లో గంగాధర్, కృష్ణవేణి దంపతులు కొన్నాళ్లుగా అద్దెకు నివాసముంటున్నారు. నెలకు రూ.4వేల అద్దె చెల్లిస్తున్నారు. Also Read: మంగళవారం ఉదయం తిరుమల రెడ్డి ఇంటి అద్దె కోసం రాగా గంగాధర్ చెల్లించాడు. ఇల్లు ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదంటూ తిరుమలరెడ్డి అతడితో గొడవకు దిగాడు. అయితే తమకు మంచి ఇల్లు దొరక్క ఆగుతున్నామని, త్వరలోనే ఖాళీ చేస్తామని గంగాధర్ చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఇంటి యజమాని తమపై తమపై దాడికి పాల్పడ్డాడని ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: తమకు అద్దె విషయంలో ఎలాంటి గొడవ లేదని, ఇల్లు ఖాళీ చేయాలని ఐదు నెలలుగా చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని యజమాని తిరుమలరెడ్డి చెబుతున్నాడు. ఆ ఇంట్లోకి తాము మారాలని అనుకుంటున్నామని చెప్పినా గంగాధర్ దంపతులు వినిపించుకోవడం లేదన్నారు. ఈ నెల ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి కూడా వెళ్లకపోవడంతోనే తాను నిలదీశాను తప్ప.. ఎలాంటి దాడి చేయలేదన్నారు. Also Read:
By April 22, 2020 at 09:26AM
No comments