కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: బాధితుడికి 14 రోజుల తర్వాత కూడా పాజిటివ్
⍟ తమిళనాడులో కేసులు 1,600కు చేరుకున్నాయి. వీరిలో 60 మందికి వైరస్ ఎలా సోకిందనే విషయం వైద్యులు గుర్తించలేకపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ 60 మందిలో ఎక్కువగా చైన్నైకు చెందినవారే కాగా.. వీరిలో ఒకరు నెల రోజుల కిందట కరోనా వైరస్ సోకిన రోగి కూడా ఉన్నారు. స్క్రీనింగ్, టెస్టింగ్ వేగవంతం చేయడంతోనే కేసులు బయటపడుతున్నాయని ఆరోగ్య అధికారులు అంటున్నారు. అయితే, ఇది కమ్యూనిటీ వ్యాప్తికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ⍟ దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్క్ దాటింది. దీంతో ప్రపంచంలో 20వేల పాజిటివ్ కేసులు దాటిన 17వ దేశంగా భారత్ నిలిచింది. మహారాష్ట్రలో మంగళవారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. ⍟ ఓవైపు కాలుష్యం పెరుగుతుంటే, మరోవైపు తరుగుతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన పుడమితల్లికి కడుపు కోత మిగుల్చు తున్నాయి. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల... ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మూగ రోదనతో కన్నీరు కార్చుతోంది. ⍟ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మహమ్మారి విజృంభణ కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా.. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పాతిక లక్షలు దాటేసింది. వైరస్‌ను కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా సడలించేందుకు సమాయత్తమవుతున్నాయి. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలను పలు దేశాలు ప్రారంభించాయి. ⍟ సాధారణంగా కరోనా బాధితుడి శరీరంలోని వైరస్ 14 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. కానీ, ఓ వ్యక్తికి మాత్రం గత 22 రోజులుగా అలాగే కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నా.. చాలా తక్కువ మందిలో ఇలా కనిపిస్తుందని చెబుతున్నారు. విశాఖ నగరం అక్కయ్యపాలేనికి చెందిన 53 ఏళ్ల ఈ వ్యక్తి మార్చిలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చారు. గతనెల 30న ఆసుపత్రిలో చేరారు. అదేరోజు నమూనా తీయగా 31న పాజిటివ్ అని తేలింది. ‘కొవిడ్-19’ లక్షణాలు మాత్రం ఎక్కడా కనపడలేదు. తిరిగి 14 రోజుల తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ⍟ కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండటంతో ఢిల్లీ-నొయిడా (గౌతంబుద్ధనగర్ జిల్లా) సరిహద్దును మూసివేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ⍟ మహబూబ్‌నగర్‌లో కొందరు మీడియా ప్రతినిధులను ఐసోలేషన్ కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు స్టాఫ్ రిపోర్టర్లతోపాటు ఓ కెమెరామెన్ ఉన్నారు. మహబూబ్ నగర్‌లో ఓ న్యూస్ ఛానెల్‌కు చెందిన స్టాఫ్ రిప్టోరర్‌తోపాటు కెమెరా మ్యాన్, మరో న్యూస్ ఛానెల్ స్టాఫ్ రిపోర్టర్ ఐసోలేషన్‌కు వెళ్లగా.. గద్వాలకు చెందిన మరో స్టాఫర్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. ⍟కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో గ్రామాలలో ఎక్కువగా నమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాలకు చెందిన ఓ గ్రామంలో గ్రామస్థులు వేప చెట్టుకు నీళ్లు పోశారు. ఇలా చేస్తే కరోనా దరి చేరదంటూ పుకారు లేవడంతో అది నమ్మిన ప్రజలు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నీళ్లు పోశారు. ⍟ ప్రధాని కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది లేదంటే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఇటీవల ఇమ్రాన్‌కు పది లక్షల రూపాయల చెక్ అందజేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలడమే దీనికి కారణం. ⍟ ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వల్లే రెండు జిల్లాల్లో కరోనా వ్యాపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు అధినేత . చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే ట్రాక్టర్లు, మనుషుల్ని పెట్టి పోలీసులు, అధికారులతో ఊరేగింపు చేశారని.. ఆరోజు ర్యాలీలో పాల్గొన్న అధికారుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అన్నారు. ⍟ లాక్‌డౌన్ వేళ నాటుసారా, లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. మద్యానికి డిమాండ్ పెరగడంతో.. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఏకంగా ఇళ్లలోనే దుకాణం పెట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కొందరు సారా కాస్తుంటే.. మరికొందరు కల్తీ లిక్కర్ తయారు చేసే పనిలో ఉన్నారు.
By April 22, 2020 at 09:16AM
No comments