Breaking News

బయట తిరగొద్దని హెచ్చరించిన ఎస్ఐ... చెంప పగులగొట్టిన వ్యక్తి


లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు రావొద్దని పోలీసులు, అధికారులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రజలు ఏకంగా పోలీసులపైనే తిరగబడటం కలవర పరుస్తోంది. తాజాగా శివారు వనస్థలిపురంలో బయట తిరగొద్దని చెప్పిన ఎస్ఐపై ఓ వ్యక్తి ఏకంగా దాడికి పాల్పడ్డాడు. Also Read: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎస్‌ఐ కె. వెంకట్‌రెడ్డి మంగళవారం గౌతమినగర్‌ రోడ్డు నంబర్‌ 5లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఉండకుంగా బయట ఎందుకు తిరుగుతున్నారని ఎస్ఐ వారిని ప్రశ్నించారు. లోపలికి వెళ్లకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్ర ప్రమోద్ అనే వ్యక్తి ఎస్ఐతో వాగ్వాదానికి దిగి చెంపపై కొట్టాడు. Also Read: దీంతో ఎస్ఐ వెంటనే వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో చంద్ర ప్రమోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని, ఈ క్రమంలోనే ఎవరైనా విధులకు ఆటంకం కలిగిస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By April 23, 2020 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-in-vanasthalipuram-over-who-attacks-on-sun-inspector/articleshow/75313474.cms

No comments