Breaking News

వెతికి మరీ దొరకబట్టా.. కేటీఆర్, రజినీలతో పాటు ఆయనకీ సవాల్ చేస్తున్నా: చిరంజీవి


మెగాస్టార్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయ్యారు. కుర్ర హీరోలకంటే ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ అందరితో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే ట్విట్టర్‌లో కాలుమోపిన చిరు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, సమాజ సేవ పెంపొందించేలా మోటివేట్ చేసే సంగతులను షేర్ చేస్తూ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయన.. ఇంటి పనులు చేసి కిచెన్‌లో దోష వేసి ఆ వీడియోను పోస్ట్ చేస్తూ మంత్రి కేటీఆర్, హీరో రజినీకాంత్‌లకు తన సవాల్ విసిరారు. ''నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం'' అంటూ ఈ వీడియో షేర్ చేయడంతో మెగా అభిమానులు మురిసిపోతూ దాన్ని వైరల్ చేసేశారు. ఇంతలో మరో ట్వీట్ చేస్తూ మణిరత్నం సర్ కూడా తన సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు చిరంజీవి. మణిరత్నం సర్ కోసం ట్విట్టర్‌లో బాగా వెతికానని, చివరకు మద్రాస్ టాకీస్ రూపంలో ఆయనను దొరకబట్టి ఛాలెంజ్ చేస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ బాగా వైరల్ అవుతోంది. మొదట రాజమౌళిని నామినేట్ చేస్తూ ఛాలెంజ్ వదలడంతో అది కాస్త రామ్ చరణ్, ఎన్టీఆర్‌, సుకుమార్, కొరటాల శివ వద్దకు చేరి చిరంజీవి వరకూ వచ్చింది. ఇంట్లో వాళ్ళ కోసం ఇంటి పని, వంట పని చేసిన వాడే రియల్ మెన్ అనేది ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్. మొత్తానికైతే ఈ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు భలే వినోదం అందిస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు.


By April 23, 2020 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-nominates-manirathnam-for-be-the-real-man-challenge/articleshow/75313876.cms

No comments