Breaking News

నంద్యాల ఆస్పత్రిలో దారుణం.. శిశువు తలను తల్లి కడుపులోనే వదిలేసిన డాక్టర్లు


జిల్లా నంద్యాలలోని ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శిశువు తలను తల్లి కడుపులోనే వదిలేసి మొండాన్ని మాత్రం బయటకు తీశారు. ఎంత ప్రయత్నించినా తలను బయటకు తీయలేకపోయిన డాక్టర్లు.. మహిళ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: కర్నూలు జిల్లా మిడుతూరు మండలం అళగనూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఏడు నెలల గర్భవతి. అయితే నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం నంద్యాలలోని మాతాశిశు వైద్యశాలకు వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, వెంటనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాలని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిడ్డను బయటకు తీసే సమయంలో తల నుంచి మొండెం వేరు అయి శిశువు చనిపోయింది. దీంతో మొండాన్ని మాత్రమే బయటకు తీసిన డాక్టర్లు.. తలను మాత్రం తల్లి కడుపులో ఉంచేశారు. దాన్ని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. మరోవైపు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సకాలంలో ఆమెకు మెరుగైన చికిత్స అందించడంతో లక్ష్మీదేవి ప్రాణాపాయం నుంచి బయటపడింది. Also Read: అయితే సిజేరియన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే శిశువు మరణించిందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులపై వారు గొడవకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజాసంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదేవికి గతంలో అబార్షన్ అయిందని, ఇప్పుడు రెండోసారి కూడా ఇలా జరగడంతో ఆమె మానసికంగా కుంగిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నెలలు నిండకపోవడం వల్లే సమస్య: డాక్టర్లు ఈ ఘటనలో తమపై వస్తున్న ఆరోపణలను నంద్యాల ఆస్పత్రి డాక్టర్లు ఖండించారు. లక్ష్మీదేవికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు వచ్చాయని, అందుకే సిజేరియన్ చేయాల్సి వచ్చిందన్నారు. బిడ్డ ఎదురుకాళ్లతో పుట్టడం వల్ల బయటకు తీయడం కష్టమైందని, ఆ క్రమంలోనే తల శరీరం నుంచి విడిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యమేమీ లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. Also Read:


By April 22, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tragedy-in-nandyal-government-hospital-baby-died-in-womb-of-the-mother/articleshow/75284302.cms

No comments