Breaking News

ప్రాణం తీసిన షార్ట్‌సర్య్కూట్.. తల్లీబిడ్డ సజీవ దహనం


నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగల నుంచి చెలరేగిన మంటల్లో తల్లి, ఏడాది కుమార్తె సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జిల్లాలోని మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పడకంటి శ్రీనివాస్‌కు అని(22)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు శ్రీనిత్, కుమార్తె శ్రీనిత(1) ఉన్నారు. Also Read: శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం సాయంత్రం అనిత ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆ సమయంలో షార్ట్‌సర్య్కూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అనిత గమనించేలోగానే మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. అనిత కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శ్రీనిత్‌ను వారు కాపాడగా అనిత, శ్రీనిత మంటల్లో చిక్కుకుని వారి కళ్లెదుటే సజీవ దహనమయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Also Read:


By April 02, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-and-child-buried-alive-in-nizamabad-district/articleshow/74940799.cms

No comments