ఇది కష్టకాలం.. అప్పు చేసైనా దానం చేస్తా.. ప్రకాష్ రాజ్ ఓపెన్ స్టేట్‌మెంట్
సీనియర్ నటుడు తన మనసులో మాట బయటపెట్టారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ ఆపత్కాల పరిస్థితుల్లో పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు. తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడం మాననని తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అందరం కలిసి కరోనాపై పోరాడదాం అని పిలుపునిచ్చారు. ‘నా శక్తి మేరకు నేను సాయం చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది’ అంటూ గతంలో ట్వీట్ చేసిన ఆయన.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు. తన ఆర్థిక వనరులు క్షీణించినా కూడా వెనక్కితగ్గనని, బ్యాంకులో రుణం తీసుకునైనా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో నాకు సాధ్యమైనంత సాయం అందిస్తాను. భవిష్యత్‌లో మళ్లీ సంపాదించుకోగలనని నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన విపత్కర సమయమిది. మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం. జీవితాలను నిలబెడదాం’’ అని పేర్కొన్నారు. Also Read: దేశాన్ని కరోనా కుదిపేస్తున్న ఈ కల్లోల సమయంలో రోజూవారి కూలీలు, పేదలకు సహాయం చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ మాటలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ‘‘యూ ఆర్ గ్రేట్, హాట్సాఫ్, మీ చెప్పినట్లుగానే పేదలకు మా వంతు సాయం చేస్తాం’’ అంటూ ఆయన ట్వీట్‌పై రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.
By April 21, 2020 at 11:30AM
No comments