Breaking News

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండో స్థానంలో దేశ రాజధాని


భారత్‌లో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2081 కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఒక్కరోజే 78 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా నుంచి కోలుకోని 431 మంది డిశ్చార్జ్ అయ్యారు. 47 మంది మరణించారు. తాజాగా రాష్ట్రపతి భవన్‌కు కూడా కరోనా తాకింది. రాష్ట్రపతి భవన్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలి కోడలికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో రాష్ట్రపతి భవన్‌లోని ఓ కాంప్లెక్స్‌లోని 125 కుటుంబాలను సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ కాంప్లెక్స్‌ను శానిటైజ్‌ చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలి కోడలి తల్లి ఇటీవలే కరోనాతో మృతి చెందింది. దీంతో కార్మికురాలి కోడలు.. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నది. ఈ క్రమంలో కోడలికి కరోనా సోకింది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. నాలుగు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కోడలు నివాసముంటున్న ఇంటితో పాటు ఆ కాంప్లెక్స్‌ను అధికారులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నమోదువుతన్న కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో కూడా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 17656కి చేరింది. వాటిలో 2842 కేసుల్లో రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 559గా ఉంది. దేశంలోని 6 రాష్ట్రాలు నిబంధనలు ఎక్కువగా సడలించడంపై నిన్న కేంద్రం ఫైర్ అయ్యింది. మళ్లీ కరోనా పెరిగే ప్రమాదం ఉందని ఆ రాష్ట్రాల్ని హెచ్చరించింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది తెలంగాణలో సోమవారం 14 కొత్త కేసులు వచ్చాయి.


By April 21, 2020 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-corona-cases-rise-to-2081-india-total-hits-18786/articleshow/75265887.cms

No comments