Breaking News

ఆమెను చంపింది ప్రియుడే.. అక్రమ సంబంధమే కొంపముంచింది


తెలంగాణలో దిశ ఘటన తర్వాత మరోసారి తీవ్ర సంచలనం సృష్టించిన తంగడపల్లిలో మహిళ హత్య కేసు కొలిక్కి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మండలం తంగడపల్లి వంతెన కింద దారుణ హత్యకు గురైన మహిళ సిక్కిం రాష్ట్రానికి చెందినదని సైబరాబాద్‌ గుర్తించారు. ఆమెను ప్రేమికుడే హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. దీనికి నిందితుడి బంధువొకరు సహకరించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read: పోలీసుల కథనం ప్రకారం... భర్త, పిల్లలున్న వివాహితకు నిందితుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఇటీవల తరుచూ గొడవలు జరిగాయి. ఘటన జరిగిన రోజు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమెను చంపేశాడు. బంధువు సాయంతో శివారుల్లో మృతదేహాన్ని పారేసేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి వంతెన కిందకు నైలాన్‌ తాడు సాయంతో మృతదేహాన్ని దించారు. తలను బండరాయితో మోదీ.. దుస్తులను తొలగించారు. Also Read: పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బంగారు ఆభరణాలను వదిలేసి వెళ్లారు. ఈ మహిళ అదృశ్యమైనట్లు సిక్కింలో కేసు నమోదు కావడంతో కేసును చేధించేందుకు వీలైంది. ఈ కేసులో సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె ‘కారు’ను గుర్తించారు. అక్కడ సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రధాన నిందితుడి (25)ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By April 01, 2020 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-police-arrests-main-accused-of-chevella-woman-murder-case/articleshow/74923666.cms

No comments