Breaking News

యూట్యూబ్ విలేకరినంటూ రేషన్ డీలర్‌‌కు బెదిరింపులు.. మహిళపై కేసు


విలేకరి పేరుతో రేషన్ డీలర్‌ను బెదిరించిన మహిళ కటకటాల పాలైన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. చింతలపూడి పట్టణంలోని పాత పురపాలక సంఘం కార్యాలయం వెనుక అడుసుమిల్లి అనూష రేషన్‌ దుకాణం నడుపుతున్నారు. సోమవారం ఎగ్గేపల్లి అనిత అనే అక్కడకు మహిళ వచ్చి తాను యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరినంటూ పరిచయం చేసుకుంది. రేషన్ దుకాణం వద్ద వీడియో, ఫొటోలు తీసింది. అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలని అనూషను డిమాండ్ చేసింది. నీకు డబ్బులు ఎందుకివ్వాలంటూ ఆమె ప్రశ్నించగా ఆ మహిళ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. Also Read: నీ రేషన్ దుకాణంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేస్తానని, దీంతో నువ్వు కేసులో ఇరుక్కుంటావని బెదిరించింది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదని, డబ్బులు ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అనూష్ తీవ్రంగా స్పందించింది. అయినప్పటికీ ఆ మహిళ బెదిరింపులకు పాల్పడటంతో అనూష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేస్తున్నారు. మీడియా పేరుతో అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By April 01, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-booked-for-money-demand-from-ration-dealer-in-west-godavari/articleshow/74923384.cms

No comments