పెళ్లయిన 25ఏళ్లకు భార్యపై అనుమానం... నిద్రపోతుండగా తలపై కొట్టి

అనుమానం పెనుభూతమై ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన జిల్లా హొళగుందలో జరిగింది. ఎమ్మిగనూరుకు చెందిన బోడ మల్లికార్జునకు బోడ సావిత్రితో(49) అనే మహిళతో 25 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. భార్యపై అనుమానం పెంచుకున్న మల్లికార్జున పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సావిత్రి కూతురుతో కలిసి గత నెల 22న హొళగుందలో ఉన్న తన తమ్ముడి వద్దకు వెళ్లిపోయింది. Also Read: ఈ నెల 1న హొళగుందకు వచ్చిన మల్లికార్జున.. శుక్రవారం రాత్రి భార్యతో మరోసారి గొడవపడ్డాడు. అర్ధరాత్రి భార్య గాఢనిద్రలో ఉండగా ఇనుప రాడ్‌తో ఆమె తల ఎడమ వైపు కొట్టి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తమ్ముడు చిలక రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 05, 2020 at 12:01PM
No comments