Breaking News

మహిళకు 19 సార్లు కరోనా పాజిటివ్... డాక్టర్ల ఆందోళన


మహమ్మారి ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే అనేకమంది ప్రాణాలు పోయాయి. ఈ వైరస్ డాక్టర్లు, సైంటిస్టులకు సైతం సవాల్ విసురుతోంది. చికిత్సకు కూడా వైరస్ అంత ఈజీగా లొంగడం లేదు. తాజాగా ఓ మహిళకు 19 సార్లు టెస్టులు చేసిన కరోనా పాజిటివ్ అనే వచ్చింది. కేరళలో ఓ మహిళకు 42 రోజులుగా చికిత్స అందిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఆమె వయసు 62 సంవత్సరాలు. ఇటలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల కారణంగా ఆమెకు కరోనా సోకింది. మార్చి 10న ఆసుపత్రిలో చేరింది. నెలరోజులకు పైగా వైద్య పర్యవేక్షణలో ఉన్నా ఆమెలో కరోనా వైరస్ జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. 19 పరీక్షల్లోనూ కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలు ఏవీ పెద్దగా బయటికి కనిపించడం లేదని డాక్టర్లు అంటున్నారు. వైరస్ ను నిర్మూలించేందుకు అనేక కాంబినేషన్లలో మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని పత్తనంతిట్ట జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.షీజా తెలిపారు. వైరస్ విషయంలో అక్కడి డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మెడికల్ బోర్డుకు కూడా నివేదించామని వెల్లడించారు. ఆమెకు ఇతర వ్యాధులేవీ లేవని, కరోనా లక్షణాలేవీ బయటికి కనిపించకపోయినా, ఇతరులకు వ్యాపింప చేస్తుందని వివరించారు. తదుపరి పరీక్షలోనూ కరోనా పాజిటివ్ వస్తే ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తామని డాక్టర్ షీజా తెలిపారు. మరోవైపు భారత్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 20వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. 600కు పైగా మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు.


By April 22, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-kerala-woman-tests-positive-19-times-after-42-days-in-hospital/articleshow/75284978.cms

No comments