Breaking News

సూర్యాపేటలో దారునం... 108 డాక్టర్‌పై కత్తితో దాడి


తెలంగాణ సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 108 డాక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ నిద్రిస్తున్న 108 డాక్టర్ నిరంజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులతో ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో నిరంజన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా మారిండంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే డాక్టర్‌పై దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్న విషయాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిరంజన్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


By April 06, 2020 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/unknown-persons-attack-on-108-ambulance-doctor-at-suryapet-district/articleshow/75003020.cms

No comments