Breaking News

Daggubati Family Corona Donation కరోనా కష్టం.. భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ


కరోనా వైరస్ నిర్మూలనకు, తిండిలేక ఇబ్బందుల పడుతున్న వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొండంత కష్టంలో తమకు చేతనైన సాయం చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన హీరోలు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో మేం ఉన్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా దగ్గుబాటు ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, సురేష్ బాబు, రానాలు తమ వంతుగా కోటి రూపాయిల సాయం ప్రకటించారు. సినీ కార్మికులు, హెల్త్ కేర్ విభాగాలకు సంబంధించిన కోటి రూపాయల సాయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విరాళంగా ప్రకటించారు. కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమలోని కార్మికులు రోజువారి అవసరాలకోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సాయాన్ని ప్రకటించింది సురేష్ ప్రొడక్షన్స్. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు.. లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి దీంతో వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు అండగా నిలుస్తూ.. సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి సినిమా, హెల్త్‌కేర్ రంగాల్లోని కార్మికుల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరింది దగ్గుబాటి ఫ్యామిలీ. Read Also:


By March 28, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/covid19-crisis-in-tollywood-venkatesh-rana-and-suresh-babu-donates-rs-1-cr-to-cinema-workers-and-health-workers/articleshow/74858969.cms

No comments