Breaking News

కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య.. గుంటూరు జిల్లాలో కలకలం


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేలాది ప్రాణాలు తీస్తోంది. అనేక దేశాల్లో రోజూ వేలాది మంది ఈ వైరస్ బారిన పడుతుండగా.. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే కరోనా భయంతో కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. కరోనా భయంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే జిల్లాలో మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. Also Read: కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అక్కల వెంకటయ్య(55) హైదరాబాద్‌లో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తు్న్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో రెండ్రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారి పేర్లు నమోదు చేయించుకోవాలని శుక్రవారం రాత్రి గ్రామంలో దండోరా వేశారు. ఇందులో భాగంగా వెంకటయ్య పేరు కూడా నమోదు చేసుకున్నారు. Also Read: దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య శనివారం ఉదయం తన రెండో కుమారుడు శిలువబాబుకు ఫోన్‌ చేసి తనకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని, తన వల్ల ఊరందరికీ వస్తుందేమోనని భయంగా ఉందన్నాడు. ఎక్కడున్నావని కొడుకు అడగ్గా గ్రామశివారులోని ద్వారకాపూడి వద్ద ఉన్నట్లు చెప్పాడు. దీంతో శిలువబాబు స్థానికులతో కలిసి అక్కడి వెళ్లేసరికే వెంకటయ్య వేపచెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 28, 2020 at 12:27PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-in-macherla-over-he-suspects-gets-corona-virus/articleshow/74858959.cms

No comments