నోట్లో గుడ్డలు కుక్కి గర్భిణిపై అఘాయిత్యం.. ప్రకాశంలో కామాంధుడి దుశ్చర్య

జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న గర్భిణిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. పీసీపల్లి మండలంలోని శంకరాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతికి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడితో రెండేళ్ల కిందట వివాహమైంది. భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. విశ్రాంతి తీసుకునేందుకు వారం రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. రోజులాగానే సోమవారం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరు బయట నిద్రపోయింది. Also Read: అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటికి సమీపంలో ఉండే కొండయ్య(27) అనే వ్యక్తి ఆమె నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురైన ఆమె... వెనువెంటనే అతడిని విదిలించుకుని పెద్దగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మేల్కోవడంతో నిందితుడు పరారయ్యాడు. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గర్భిణిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కొండయ్యకు నేర చరిత్ర ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. Also Read:
By March 18, 2020 at 09:06AM
No comments