అల్లరి చేస్తున్నాడని ప్రియురాలి కొడుకుని కొట్టి చంపేశాడు... కర్నూలులో కిరాతకం

నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లరి చేస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి ప్రియురాలి కొడుకుని తీవ్రంగా కొట్టి చంపేశాడు. కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో బేల్దారు పనిచేస్తున్న ఫరూఖ్‌కు బెంగళూరుకు చెందిన ఓ వివాహితతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల కుమారుడు ఉన్న ఆమె ఆరు నెలల క్రితం భర్తకు విడాకులిచ్చేసి ఒంటరిగా జీవిస్తోంది. వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. Also Read: దీంతో ఆ వివాహిత కుమారుడితో కలిసి కర్నూలుకు వచ్చేసి ఫరూఖ్‌తో సహజీవనం చేస్తోంది. ఆమె కుమారుడు జుల్సీ ఆదివారం రాత్రి ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నాడు. దీంతో విసుగుచెందిన ఫరూక్ బాలుడిని హెచ్చరించాడు. అయినప్పటికీ జుల్సీ అల్లరి ఆపకపోవడంతో ఫరూఖ్ విచక్షణ కోల్పోయాడు. బాలుడి తలను గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By March 30, 2020 at 08:53AM
No comments