Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: అమెరికాలో 1.41 లక్షలకు చేరిన కరోనా కేసులు.. 2,400 మంది మృతి


ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. వేలాదిగా ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా.. దాదాపు 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే ఉన్నారు. వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలు దాటింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. దీనిని మరింత కట్టుదిట్టంగా అమలుచేయాలని కేంద్రం మరోసారి రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసివేసి, ఎక్కడివారిని అక్కడే నిలిపివేయాలని సూచించింది. వలస కార్మికుల కదలికలతో వైరస్ ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. హొచీమ్ పట్టణంలో ఆయన మృతదేహాన్ని హై స్పీడ్ రైల్వే లైన్‌పై గుర్తించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఏ వ్యక్తి బయటపడ్డాడు. మామూలుగా చూస్తే ఇందులో పెద్ద విశేషమేం లేదు.. ఎందుకంటే కరోనా వచ్చిన వాళ్లలో 95 శాతం మంది కోలుకున్నారు. కానీ, వృద్ధులు, పిల్లలు మాత్రం దీని వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైద్యులు అద్భుతం సృష్టించారు. కరోనా మహమ్మారి నుంచి 65 ఏళ్ల వృద్ధుడిని బయటపడేశారు. కరోనా వైరస్‌ (కోవిడ్ 19)పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలను అందజేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నంగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ సంస్థ రైల్వే శాఖ భారీ విరాళం ప్రకటించగా.. తాజాగా, కేంద్ర రక్షణ ఉద్యోగులు భూరి విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టడికి తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత కారణాల రీత్యా హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీపై దృష్టి పెట్టింది. ఆ ప్రాంతంలో రెండు కుటుంబాల వారికి, మరో ప్రాంతంలో ఓ కుటుంబానికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు చెందిన వారు ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరెవరిని కలిశారు అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా వ్యాధిని నియంత్రణ పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.


By March 30, 2020 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-news-updates-in-andhra-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/74881684.cms

No comments