Breaking News

వదినతో అక్రమ సంబంధం. పెట్రోల్ పోసి నిప్పింటించిన అన్న


ఓ యువకుడి ప్రాణం మీదికి తెచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కసితో వరసకు తమ్ముడయ్యే యువకుడిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండలం అజ్జంపూడిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. Also Read: అజ్జంపూడిలో నివసించే ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారి ఇంటికి సమీపంలోనే వరుసకు తమ్ముడయ్యే యువకుడు నివసిస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడికి ఆ వ్యక్తి భార్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా కొనసాగుతున్న అనైతిక బంధం ఇటీవలే భర్తకు తెలిసింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినా పట్టించుకోకుండా ఆమెకు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పరువు పోయిందని భావించిన మహిళ భర్త తీవ్ర నిర్ణయానికి వచ్చాడు. Also Read: గురువారం తెల్లవారుజామున యువకుడు బహిర్భూమికి వెళ్లిన సమయంలో నైటీ, మాస్క్‌తో వెళ్లి కళ్లలో కారం జల్లి.. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ బాధితుడు రోడ్డు మీదికి రావడాన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. Also Read:


By March 13, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-sman-set-ablaze-relative-for-illegal-affair-in-krishna-district/articleshow/74605208.cms

No comments