Breaking News

ప్రియుడి కారణంగా బిడ్డను కన్న వివాహిత.. శిశువును మూటకట్టి బావిలో పడేసి


కన్నతల్లి అన్న పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించిందో మహిళ. భర్తతో విడిపోయి మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె ఇద్దరికీ పుట్టిన బిడ్డను బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన తమిళనాడులోని జిల్లా ఒడుగత్తూరులో వెలుగుచూసింది. ఒడుగత్తూరు సమీపం అసనాంబట్టు కల్లపారై పరిధికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతో రెండు సంవత్సరాల క్రితం వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మహిళ కల్లపారైలో ఒంటరిగా నివసిస్తూ ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. Also Read: అతడి కారణంగా గర్భం దాల్చిన ఆమె ఈ నెల 20వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రియుడి కారణంగా పుట్టిన బిడ్డ తనకు వద్దని భావించిన మహిళ శిశువును గోనెసంచిలో చుట్టి ఓ బావిలో పడేసింది. గురువారం ఉదయం బావిలో మూటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మూటను పైకి తీసి చూడగా నవజాత శిశువు మృతదేహం బయటపడింది. Also Read: గ్రామంలో ఐదు రోజుల క్రితం ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చిందని స్థానికులు చెప్పడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. మూటలో దొరికిన శిశువు ఆమెదేనని గుర్తించి నిలదీయగా.. ప్రియుడి కారణంగా పుట్టిన బిడ్డను పెంచడం ఇష్టంలేకే చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


By March 27, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-mother-kills-baby-girl-over-illegal-affair/articleshow/74839173.cms

No comments