Breaking News

న్యూస్ పేపర్లతో కరోనా వ్యాప్తి.. నిజమా? కాదా?... క్లారిటీ ఇచ్చిన ప్రముఖ డాక్టర్


దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న వేళ అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 31వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు కఠిన హెచ్చరికలు జారీచేశారు. ఇలాంటి విపత్కర సమయంలో అనేక ఫేక్ న్యూస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజూ అనేక మందికి న్యూస్ పేపర్ చదవడం అలవాటుగా ఉంటుంది. అయితే న్యూస్ పేపర్ వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్త కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తోంది. దీంతో ప్రజలు న్యూస్ పేపర్ చదవడమే మానేస్తున్నారు. దీంతో వార్తా సంస్థలు పేపర్ ప్రింటింగ్ చాలావరకు తగ్గించేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలైతే మార్చి 31 వరకు పేపర్ ప్రింటింగ్‌‌కు విరామం ప్రకటించాయి. అయితే న్యూస్ పేపర్ల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న కేవలం అపోహ మాత్రమే అస్సాంకు చెందిన ప్రముఖ డాక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఇలియాస్ అలీ చెబుతున్నారు. Also Read: ‘పత్రికలతో కరోనా వైరస్‌ వస్తుందన్నది కేవలం దుష్ప్రచారమే. నిజానికి కరోనా వైరస్‌పై వివిధ వర్గాలకు పత్రికలు అవగాహన పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. కరోనా వైరస్‌కు చేరువగా వచ్చినప్పుడే ఒక వ్యక్తికి ఆ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. అందువల్ల ఇతరులకు కనీసం మీటరు దూరం పాటించాలి. ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌ బరువెక్కువ కావడంతో రోగి తుమ్మినప్పుడు అది మీటరు కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. తుమ్ము వచ్చినప్పుడు ముఖానికి చేతి రుమాలును అడ్డుపెట్టుకోవాలి. ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా రోగులు క్వారంటైన్‌లో ఉండాలి. చేతి ద్వారా కూడా వైరస్‌ వ్యాపించే వీలుంది. అందువల్ల తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి’ అని ఆయన సూచించారు. Also Read:


By March 24, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/news-papers-didnt-spread-corona-virus-says-doctor-ilias-ali/articleshow/74784852.cms

No comments