కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ కలకలం.. ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి

⍟ ప్రపంచవ్యాప్తంగా మరింత ఉద్ధృతంగా సాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాది మంది పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దీని వ్యాప్తి రోజుకు సగటున 500గా నమోదయ్యింది. తొలి లక్ష 67 రోజుల్లో చేరుకుంటే, రెండో లక్షను కేవలం 11 రోజుల్లోనే చేరింది. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్నకేసులను చూస్తే సామూహిక వ్యాప్తి దశకు వైరస్ చేరుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 200కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 11 మంది మృతిచెందారు. అయితే, దేశంలో కరోనా వైరస్ ఇంకా సమూహాలలో వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. స్థానిక సంక్రమణ దశలోనే ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం కొత్తగా 227 మందిలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,251కి చేరింది. ⍟ తెలుగు రాష్ట్రాలను కరోనా పరేషాన్ వెంటాడుతోంది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోవడం టెన్షన్ పెడుతోంది. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ⍟ తెలంగాణలోని కరోనా మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ⍟ తెలంగాణలో కరోనా వైరస్‌తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, గ్లోబల్ హాస్పిటల్లో ఒకరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి ద్వారా వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంతకూ ఏమైందంటే.. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో మత పరమైన ప్రార్థనలు నిర్వహించారు. . ⍟ దేశంలో త్వరలోనే అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధిస్తారని వస్తున్న సోషల్ మీడియా వార్తలు అవాస్తవమని భారత సైన్యం తెలిపింది. కరోనా వైరస్ (కోవిడ్ 19)ను కట్టడి చేసేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే నెల్లో అత్యయిక స్థితి విధిస్తుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి ⍟ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియా బులెటిన్‌ను ద్వారా వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో కరీంనగర్‌కు చెందిన రెండు కేసులు కూడా ఉన్నాయి. కోవిడ్‌కు చికిత్స పొందిన 13 మందికి నెగటివ్ రావడంతో.. చెస్ట్ హాస్పిటల్ నుంచి వారిని డిశ్చార్జ్ చేశారు. ⍟ ఒకేసారి ఆరుగురు కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసేలా నేవల్ డాక్‌యార్డు ఉద్యోగులు ‘సిక్స్‌వే మల్టీ ఫీడ్-ఆక్సిజన్’ పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఒక ఆక్సిజన్ సిలిండర్‌పై ఒక రోగికి మాత్రమే ప్రాణవాయువును అందిస్తున్నారు. ఇప్పటికే నౌకాదళ ఆసుపత్రి ‘ఐఎన్‌ఎస్ కల్యాణి’లో ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. విజయవంతమైందని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి.
By March 31, 2020 at 09:10AM
No comments