Breaking News

ఏపీ: గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య


జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య కలకలంరేపింది. స్వాతి అనే యువతి యాదమరి మండలం కమ్మపల్లె గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అసి‌స్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే మండలం మాదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో అద్దె గదిలో ఉంటున్నారు.. ఏం జరిగిందో ఏమో ఆ అద్దె ఇంట్లోనే స్వాతి ఫ్యాన్‌కి ఉరివేసుకున్నట్లుగా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.ఆమె చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించి స్థానికుల్ని అడిగి వివరాలు సేకరించారు.. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వాతి స్వస్థలం చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఐకే రెడ్డిపల్లి కాగా.. ఆమెకు వివాహమై రెండు ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సమస్యలు ఏమైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.


By March 31, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/grama-sachivalayam-employee-suicide-in-chittoor-district/articleshow/74905172.cms

No comments