ఇద్దరు బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. విశాఖలో కీచకపర్వం

విశాఖ జిల్లా మన్యంలో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా బాలికల తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: మండలం రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. ఆ సమయంలో కారులో వచ్చిన రేగ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అరకులోయలో జరుగుతున్న జాతరకు వెళ్దామని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నారు. అరకులోయ చేరుకుని జాతర ఈ రోజు లేదని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో జనంగుడ గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికలను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: బాలికల కేకలు విన్న స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా జనంగుడ గ్రామస్థులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన గోపితో పాటు అతడి నలుగురు స్నేహితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం బాధితుల బంధువులు, ప్రజాసంఘాలు నాయకులు అరకులోయలో ఆందోళన చేపట్టారు. Also Read:
By March 04, 2020 at 10:10AM
No comments