Breaking News

రేణిగుంటలో 6 నెలల బాలుడి కిడ్నాప్.. పని ఇప్పిస్తానని నమ్మబలికి


చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వేలో పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ ఇద్దరికీ కొత్త బట్టలు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి బాలుడితో ఉడాయించింది. దీంతో బాధితురాలు రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: రేణిగుంటకు చెందిన స్వర్ణలతకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలల క్రితం బాబు పుట్టాడు. భర్త మద్యానికి బానిసై నిత్యం వేధిస్తుండటంతో ఆమె కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. అయితే తాగుబోతు భర్త అక్కడికి కూడా వచ్చి వేధిస్తుండంతో నాలుగు రోజుల క్రితం బయటకు వచ్చేసి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నాలుగు రోజులుగా రైల్వేస్టేషన్లోనే గడుపుతోంది.అక్కడ పనిచేసే స్వీపర్ ద్వారా స్వర్ణలతకు ఓ మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో పనిచేస్తున్నానని, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. Also Read: ఈ క్రమంలోనే తల్లీబిడ్డకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన ఆమె స్వర్ణలతను మభ్యపెట్టి బాబుతో ఉడాయించింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాలుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By March 04, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6-months-old-boy-kidnapped-in-renigunta-railway-station/articleshow/74469641.cms

No comments