యువతిపై రేప్, దారుణ హత్య.. చేవెళ్లలో మరో దిశ ఘటన

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తంగడపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. అంతకుముందు ఆమెపై దుండగులు అత్యాచారానికి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. చనిపోయిన మహిళకు 30 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, ఆమె వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మహిళ తలపై రాయితో మోదడంతో ఆమె మరణించినట్లుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతురాలి ఒంటిపై వస్ర్తాలు ఏమీ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు తేల్చారు. గ్రామ శివారు ప్రాంతంలోని ఓ వంతెన కింద దుండగులు ఈ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏమీ లేకపోవడంతో, అక్కడికి వచ్చే మార్గంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళను హత్య చేశాక దుండగులు ఆమెకు సంబంధిన ఆనవాళ్లు ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారని, ఆ నేరంలో ఎంత మంది పాల్గొన్నారనే అంశంపైనా స్పష్టత లేదు. తొలుత మృతురాలు ఏ ప్రాంతానికి చెందిందో తెలిస్తే దర్యాప్తు సులభం అవుతుందని పోలీసులు తెలిపారు.
By March 17, 2020 at 09:35AM
No comments