‘సారీ బ్రదర్’ చెర్రీకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్

ఇవాళ మెగా పవర్ స్టార్ . ఈ సందర్భంగా ప్రముఖులంతా మెగా హీరోకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చరణ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తానంటూ ముందురోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. సరిగ్గా పదిగంటలకు తన గిఫ్ట్ ఇస్తానన్నాడు. అయితే తాజాగా తారక్ మరో ట్వీట్ చేశాడు. ‘ సారీ రామ్ చరణ్... నీ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ దగ్గకు వెళ్లింది’కాస్త ఆలస్యం అవుతుంది అని తారక్ ట్వీట్ చేశాడు. తారక్ ట్వీట్ చూసిన చెర్రీ నిరాశ వ్యక్తంచేశాడు. ‘ ఏంటి నువ్వు ఆయన దగ్గరకు వెళ్లావా... ఇవాల్టికి వస్తుందా?’ అంటూ ప్రశ్నించాడు. మరోవైపు చిరంజీవీ కూడా ట్వీట్ చేశారు. నేను వెయిట్ చేస్తున్నానంటూ అంటూ మెగాస్టార్ పోస్టు పెట్టారు. మెగాస్టార్ ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు. ‘సార్... అంటే... అది కొంచెం.. కొంచెం యాక్చువల్ గా ప్లీజ్ సార్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవాళే అందుతుందా లేదా అని అటు తారక్ అభిమానులు... ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గిఫ్ట్ ఏంటో చెప్పు అంటూ అటు ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
By March 27, 2020 at 11:08AM
No comments