ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లిన మహిళ.. అతడి భార్య, కుటుబసభ్యుల చేతితో చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జిల్లా సిద్ధవటం మండలం వెంకటాయపల్లె గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. మృతురాలిని జిల్లాకు చెందిన పద్మ(30)గా పోలీసులు గుర్తించారు. Also Read: సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాయపల్లె గ్రామానికి చెందిన గువ్వల ఓబయ్య నెల్లూరు పట్టణానికి చెందిన పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలారోజులుగా ఇద్దరూ తమ కుటుంబాలకు తెలియకుండా వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రియురాలితో గడిపేందుకు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఓబయ్యను మరో మహిళతో చూసిన అతడి భార్య కృష్ణమ్మ గొడవకు దిగింది. పరాయి మహిళను ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తావా? అంటూ దుర్భాషలాడింది. కుటుంబసభ్యులు కూడా కృష్ణమ్మతో జతకలిసి ఓబయ్య, పద్మపై దాడికి పాల్పడ్డారు. Also Read: ఓబయ్యను పక్క గదిలోకి తీసుకెళ్లి తాళ్లతో చేతులు, కాళ్లు కట్టిపడేశారు. అనంతరం కృష్ణమ్మ, కుటుంబ సభ్యులు కలసి పద్మపై దాడి చేసి ఆమె మెడకు కండువా బిగించి హత్య చేశారు. సోమవారం తెల్లవారుజామున స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ హనుమంత్‌నాయక్, సిద్దవటం ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం పద్మ మృతదేహాన్ని కడప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై ఓబయ్య భార్య కృష్ణమ్మ, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. Also Read:
By March 17, 2020 at 11:46AM
No comments