Breaking News

‘ఓ పిట్టకథ’ ట్విట్టర్ రెస్పాన్స్.. పిట్ట కొంచెం కూత ఘనమా?


సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘ఓ పిట్టకథ’ చిత్రాన్ని నేడు (మార్చి 06) రిలీజ్ చేశారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరోల మద్దతు లభించడంతో చిన్న సినిమానే అయినప్పటికీ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడమే కాకుండా.. అదే వేడుకలో తన 152 మూవీ ‘ఆచార్య’ టైటిల్‌‌ను అనౌన్స్ చేయడంతో ‘ఓ పిట్టకథ’ చిత్రానికి అటెన్షన్ వచ్చేసింది. చిరంజీవి మొదలు.. మహేష్ బాబు, ప్రభాస్, రానా, నాని, పూరీ, రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్, పూజా హెగ్డే, రకుల్ ఇలా చాలా మంది స్టార్స్ ‘ఓ పిట్టకథ’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగస్వామ్యం అవుతూ చిత్ర యూనిట్‌కి విషెష్ అందించాయి. ఇక మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ట్విట్టర్‌లో చిత్ర యూనిట్‌కి విషెష్ అందిస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.


By March 06, 2020 at 10:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/brahmaji-son-sanjay-o-pitta-katha-movie-twitter-review-response/articleshow/74504563.cms

No comments