Breaking News

కరోనా ఎఫెక్ట్.. హోళీ వేడుకలకు ప్రధాని దూరం, మరి మీరు?


ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. మనదేశంలో తాజాగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధి లక్షణాలున్న వారిని క్వారంటైన్‌లో అబ్జర్వేషన్లో ఉంచారు. కరోనా వైరస్ ముప్పు భయపెడుతున్న వేళ.. తాను ఈ ఏడాది హోళీ వేడుకల్లో పాల్గొనడం లేదని ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు భారీగా ఒకే చోట గుమికూడొద్దని నిపుణులు సూచించారని.. అందుకే తాను ఈ ఏడాది హోళీ వేడుకల్లో పాల్గొనొద్దని తాను నిర్ణయించుకున్నానని ప్రధాని తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయంతో.. దేశ ప్రజలు కూడా హోళీ వేడుకులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. భారత్‌లో మొత్తం 21 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు కాగా.. ఐదుగురు భారతీయులు. కేరళకు చెందిన ముగ్గురికి గతంలో కరోనా వైరస్ సోకగా.. వారికి నయమైంది. ఇటీవల ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చిన మరొకరికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.


By March 04, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-decides-to-not-participate-in-holi-events-to-avoid-coronavirus-spread/articleshow/74471562.cms

No comments