Breaking News

భార్యను చంపిన కేసులో జైలుకి.. ఏడేళ్ల తర్వాత ఆమె ప్రియుడితో కనిపించేసరికి


పెళ్లి చేసుకున్న పాపానికి ఓ వ్యక్తి ఏకంగా ఏడేళ్ల పాటు నరకం అనుభవించిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. పెళ్లయిన రెండు నెలలకే భార్య కనిపించకుండా పోయింది. అదనపు కట్నం కోసం అల్లుడే తమ కూతురుని చంపి శవాన్ని మాయం చేశాడని అత్తమామలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేసి జైల్లో పెట్టారు. అయితే తాను ఎలాంటి నేరం చేయకపోయినా జైలుపాలు కావడాన్ని సహించలేని ఆ వ్యక్తి అంతులేని పోరాటం చేశాడు. ఏడేళ్ల తర్వాత తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకున్నాడు. ఒడిశాలోని కేంద్రపడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. Also Read: ఒడిశాలోని కేంద్రపడ జిల్లాకు చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2013లో వివాహమైంది. రెండు నెలల తర్వాత ఆమె అదృశ్యం కావడంతో కట్నం కోసం తన కుమార్తెను అల్లుడే హత్యచేసి, మృతదేహాన్ని ఎక్కడో పూడ్చి పెట్టి ఉంటాడని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నెలరోజుల పాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన అతడు తాను ఏ నేరం చేయలేదని నిరూపించుకునేందుకు ఏడేళ్లుగా భార్య కోసం వెతుకుతూనే ఉన్నాడు. Also Read: చివరకు ఆమె చివరకు పూరీ జిల్లా పిప్పిలిలో రాజీవ్‌లోచన్‌ మహరాణా అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోందని నిర్ధారించుకుని పోలీసులకు తెలిపాడు. పోలీసులు అక్కడకు చేరుకుని రాజీవ్‌ను, ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వారిద్దరూ ముందు నుంచే ప్రేమించుకుంటున్నారని, యువతి తల్లిదండ్రులు బలవంతంగా మరో వ్యక్తికిచ్చి పెళ్లి చేసినట్లు పోలీసులు తెలుసుకుని అవాక్కయ్యారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఏడేళ్ల పాటు రాష్ట్రమంతా తిరిగిన ఆ బాధితుడు భార్య బాగోతాన్ని బయటపెట్టి తాను నేరస్థుడిని కాదని నిరూపించుకున్నాడు. చేయని తప్పుకు తాను ఏడేళ్లు నరకం అనుభవించారని వాపోతున్నాడు. Also Read:


By March 04, 2020 at 12:40PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-man-tragedy-story-he-caught-red-handed-wife-with-her-boy-friend-after-7-years/articleshow/74471913.cms

No comments