Breaking News

విజయవాడలో కరోనా కలకలం.. జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తికి..


భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. ఏపీలోనూ కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్నాయి. విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో హాస్పిటల్‌లో చేరారు. ఇటీవలే అతడు జర్మనీ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి వచ్చాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతణ్ని ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలను హైదరాబాద్ పంపామని తెలిపారు. జలుబుతో బాధపడుతున్న సదరు వ్యక్తి కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో హాస్పిటల్‌కు వచ్చాడని డాక్టర్లు తెలిపారు. అతడిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. టెస్టులకు సంబంధించిన ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయని డాక్టర్లు చెప్పారు. ఇది అనుమానిత కేసు కూడా కాదన్నారు. అతడు విమానయానం చేసిన కారణంగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. మూడో రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించాయని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఆ యువకుడు హైదారాబాద్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి వారం కిందటే తిరిగొచ్చాడు. అతడికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


By March 04, 2020 at 12:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-who-returned-from-germany-admits-in-vijayawada-govt-hospital-with-coronavirus-symptoms/articleshow/74472232.cms

No comments