Breaking News

లేడీ టీచర్‌కు ప్రిన్సిపాల్ వల.. పెళ్లయిన విషయం దాచిపెట్టి


విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలకు ప్రిన్సిపాల్ ఉన్నవాడే కామాంధుడిగా మారాడు. తన స్కూల్‌లో పనిచేస్తున్న లేడీ టీచర్‌కు వలవేసి లొంగదీసుకున్నాడు. తనకు భార్య, పిల్లలున్న విషయం దాచిపెట్టి ఆమెను రెండో పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని కార్మికనగర్‌లో వెలుగుచూసింది. Also Read: హబీబ్‌ ఫాతిమా నగర్‌లో నివసించే అయూబ్‌ అలీ(42) కార్మికనగర్‌లో ఓ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇప్పటికే వివాహమై పిల్లలున్నారు. అదే స్కూల్‌లో పనిచేసే ఓ లేడీ టీచర్(23)పై కన్నేసిన అతడు స్నేహం పెంచుకున్నాడు. తనకు ఇప్పటికే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి పది రోజుల క్రితం ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం స్కూల్‌పై దాడి చేశారు. ఫర్నిచర్‌, కంప్యూటర్‌, పూలకుండీలను ధ్వంసం చేశారు. బాధితురాలు ప్రిన్సిపాల్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయూబ్‌ ఖాన్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. Also Read:


By March 15, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/school-principal-cheats-lady-teacher-in-hyderabad/articleshow/74634105.cms

No comments