అత్తింటి ముందే అల్లుడి ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు

నగరం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మంగళగిరి పట్టణానికి చెందిన సీహెచ్ మణికంగ(29) శనివారం అత్తగారింటి ముందే సైనేడ్ తాగి ప్రాణాలు తీసుకున్నాడు. రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్న మణికంఠ నోటివెంట నురగలు రావడాన్ని చూసిన స్థానికులు పురుగుల మందు తాగాడేమోనని అనుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అతడు తాగించి పురుగుల మందు కాదని సైనేడ్ అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. Also Read: మణికంఠ చేసుకున్నట్లు తెలిసినా అతడి అత్తమామల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారింట్లో తనిఖీ చేయగా ఓ డైరీ దొరికింది. తన చావుకు అత్తమామలే కారణమని రాసి ఉండటంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By March 15, 2020 at 09:11AM
No comments