కరీంనగర్ రాధిక హత్య కేసు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్... పోలీసుల అదుపులో తండ్రి

కరీంనగర్‌లో ఇంటర్ స్టూడెంట్ రాధిక హత్య కేసు చిక్కుముడి వీడేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 10న కరీంనగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఇంట్లోనే ఆమెను కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి 75 మంది పోలీసులతో 8 బృందాలు ఏర్పాటు చేసి లోతుగా విచారణ చేయించారు. ఈ హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని నిర్ధారించుకున్న పోలీసులు.. రాధి కుటుంబసభ్యుల ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. జర్మనీ టెక్నాలజీతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సుమారు 3000 ఫోన్ కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. Also Read: కుటుంబసభ్యుల ఫోన్ కాల్‌డేటా, హత్య జరిగిన టవర్‌లోని ఫోన్ కాల్స్, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరే రాధికను హత్య చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. దీంతో రాధిక తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఆదివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. Also Read: రాధికను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? గొంతు కోసి కిరాతకంగా చంపడానికి కారణం ఏంటి..? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. రాధిక పోలియోతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు రూ.లక్షలు ఖర్చుపెట్టి చికిత్స అందించారు. ఆమె వైకల్యాన్ని అధిగమించి చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ఆమెకు మళ్లీ చికిత్స, ఉన్నత చదువులు, వివాహం చేయాలంటే ఖర్చు ఎక్కువవుతుందని ఆలోచించారా? అన్న ప్రశ్నలపై పోలీసులు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. ఇటీవల రాధిక మళ్లీ అనారోగ్యానికి గురైందని, ఆమెకు చికిత్స చేయిస్తే రూ.లక్షలు ఖర్చు అవుతాయని భావించే కుటుంబ సభ్యుల్లో ఒకరు హతమార్చినట్లు భావిస్తున్నారు. Also Read:
By March 02, 2020 at 11:03AM
No comments