Breaking News

కడప రిమ్స్ పక్కనే వ్యభిచార గృహం.. నిర్వాహకుడికి షాకిచ్చిన కోర్టు


నగరంలోని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వ్యక్తికి కడప కోర్టు షాకిచ్చింది. కడప రవీంద్రనగర్‌కు చెందిన షరీఫ్‌ అలియాస్‌ మున్నా అనే వ్యక్తి రిమ్స్‌ పీఎస్ పరిధిలోని బీడీ కాలనీలో కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలు, యువతులను తీసుకొచ్చి వారిని మభ్యపెట్టి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఆర్థికంగా బలహీనంగా మహిళలకు సులభంగా డబ్బు సంపాదించొచ్చంటూ మాయమాటలు చెప్పి భారీస్థాయిలో వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. Also Read: స్థానికుల ఫిర్యాదుతో మున్నా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు రైడ్ చేసి అతడిని అరెస్ట్ చేశారు. సెక్స్‌వర్కర్లకు విముక్తి కల్పించి పునరావాస కేంద్రానికి తరలించారు. మున్నాపై ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిళల శరీరాలతో వ్యాపారం చేయిస్తున్న మున్నాను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు రూ.4వేల జరిమానా విధించింది. Also Read:


By March 19, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-owner-gets-4-yr-jail-in-kadapa/articleshow/74704048.cms

No comments