Breaking News

హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్... జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్


హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరతాబాద్‌లో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న జూనియర్ ఆర్టిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాదరి కొత్తగూడెం జిల్లాకు చెందిన కిరణ్, అశ్వారావుపేటకు చెందిన 24 ఏళల పవన్ తెలుగు సినిమాలో జూనియర్ ఆర్టిస్గ్‌గా పనిచేస్తున్నాడు. సినిమాల ద్వారా వచ్చే సంపాదన సరిపోక... అడ్డదారులు తొక్కాడు. ఈ క్రమంలోనే.. ఖైరతాబాద్ రాజ్ నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా గుట్టుగా సెక్స్ దందా నిర్వహిస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకున్నారు. ఖైరతాబాద్ రాజ్‌నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేసి పవన్‌ను అరెస్ట్ చేశారు. మరో కిరణ్ అనే వ్యక్తి పరారయ్యాడు. పవన్ నుంచి మొబైల్ ఫోన్, రూ. 2 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే జబర్దస్త్ నటుడు దొరబాబు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. విశాఖలో ఒక మహిళతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తనను వదలేయాలని ఇద్దరూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పోలీసులకు దొరికిపోయిన వారిలో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు, పరదేశితో పాటూ మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హైపర్ ఆది టీమ్‌లో కమెడియన్స్‌గా చేస్తున్నారు.


By March 19, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-in-hyderabad-police-arrest-junior-artist/articleshow/74704292.cms

No comments