విశాఖలో విషాద ఘటన.. తల్లీ, చెల్లెళ్లను చూసేందుకు బైక్‌పై వెళ్తూ యువకుడి దుర్మరణం

కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్న సమయంలో అమ్మ, చెల్లెళ్లకు అండగా నిలబడాలన్న ఆశతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి స్వస్థలానికి బైక్‌పై బయలుదేరాడు. అయితే ఇంటికి చేరకుండానే ప్రాణాలు కోల్పోయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నం జిల్లా యలమంచిలి కూడలి వద్ద జరిగింది. Also Read: జిల్లా సోంపేట మండలం బ్రాహ్మణకొర్లాంకు చెందిన శ్రీకాంత్ మహంతి(30) తండ్రి ఏడాది క్రితం గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబ బాధ్యతలను శ్రీకాంత్ తలకెత్తుకున్నాడు. వృద్ధురాలైన నాన్నమ్మ, అమ్మ, ఇద్దరి చెల్లెళ్లను పోషించేందుకు ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లాడు. ఈ కామర్స్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటికి వెళ్తే ఖర్చులు అవుతాయన్న ఆలోచనతో కొంతకాలంగా కుటుంబసభ్యులను కూడా కలుసుకోకుండా ఉద్యోగం చేస్తున్నాడు. Also Read: అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న తరుణంలో అమ్మను చూడాలని, చెల్లెళ్లకు అండగా నిలవాలని అనుకున్నాడు. బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ జోగా మహాపాత్రోతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దారిపొడవునా ఎన్నో ఆటంకాలను అధిగమించి యలమంచిలి వరకు చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో రోడ్డుపై అడ్డంగా వచ్చిన వ్యక్తిని తప్పించబోయి బైక్‌తో డివైడర్‌ని ఢీకొట్టాడు, తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మహాపాత్రో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. శ్రీకాంత్ మరణవార్త విని తల్లి రేణుక, నాన్నమ్మ పద్మావతి కుప్పకూలిపోయారు. ఇద్దరు చెల్లెళ్ల రోదనలు మిన్నంటాయి. ఆ కుటుంబానికి వచ్చిన కష్టం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:
By March 27, 2020 at 08:13AM
No comments