Breaking News

బిగ్ బ్రేకింగ్: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మారుతీరావు స్వస్థలం. Also Read: కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతక ముఠాతో దారుణంగా హత్య చేయించాడు. ఆ కేసులో జైలుపాలయ్యాడు. ఇటీవలె బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపాడు. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు. అప్పటి నుంచి కూతురు అమృతకు మారుతీరావు వేధింపులు.


By March 08, 2020 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pranay-murder-case-amrutha-father-maruthi-rao-commits-suicide-in-hyderabad/articleshow/74534017.cms

No comments