Breaking News

కారులోనే మహిళపై అత్యాచారం.. రంగారెడ్డి జిల్లాలో దారుణం


ఒంటరిగా వస్తున్న మహిళపై కన్నేసిన కామాంధుడు లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికాడు. మా ఊరు వ్యక్తే కదా అని కారు ఎక్కిన మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ పరిధిలోని చందనవళ్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పని మీద సమీపంలోని మరో గ్రామానికి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ ఊరికి వెళ్లే దారిలో ఆటో కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటు వైపు కారులో వచ్చిన ప్రవీణ్ లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికాడు. ఒకే ఊరు వ్యక్తి కావడంతో ఆమె కారు ఎక్కింది. అదే ఆమె పాలిట శాపమైంది. Also Read: ఆమెపై కన్నేసిన ప్రవీణ్.. కారును దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. మహిళలను దారుణంగా రేప్ చేశాడు. ఎలాగోలా ప్రవీణ్ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు గ్రామానికి చేరుకుంది. విషయం కుటుంబ సభ్యులకు చెప్పి వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Read Also:


By March 08, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-waiting-for-auto-offered-lift-raped-in-car-in-rangareddy/articleshow/74533933.cms

No comments