నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో రాసలీలలు.. రోగి బంధువుతో గదిలో

అనారోగ్యంతో బాధపడే ప్రజలకు వైద్యం చేసేందుకు ఏర్పాటుచేసిన ప్రభుత్వాసుపత్రులు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది రోగుల వెంట వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆసుపత్రుల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు ఉండడం లేదు. Also Read: తాజాగా నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది ఒకరు చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకురాలితో సన్నిహితంగా ఉండగా తోటి సిబ్బంది బయట గడియపెట్టారు. అయితే లోపల ఉన్న శానిటేషన్ కార్మికుడు తన సన్నిహితులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు వచ్చి మహిళను బయటకు పంపి అతనిని లోపలే ఉంచి గడియపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది ఆసుపత్రి వ్యవహారాలు చూస్తున్న డాక్టర్‌కి ఫోన్ చేసి చెప్పారు. Also Read: దీంతో హాస్పిటల్ ఆవరణలో గంటపాటు హైడ్రామా నడిచింది. అధికార పార్టీకి చెందిన ఆ డాక్టర్ వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని హల్‌చల్ చేశాడు. లోపలికి ఎవరినీ రానీయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చిన గది లోపలికి వెళ్లి చూడగా శానిటేషన్ కార్మికుడు ఒక్కడే ఉండటంతో పోలీసులు వెనుదిరిగారు. ఆస్పత్రిలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం పెరిగిపోయిందని, కొందరు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా సూపరింటెండెంట్ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. Also Read:
By March 11, 2020 at 11:00AM
No comments