కరోనా వైరస్‌తో 50 మంది డాక్టర్లు మృతి.. ఇటలీలో మరో విషాదం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7లక్షలు దాటిందంటేనే దాని ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోంది. చిన్న దేశాల నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు అన్ని దేశాలను ఈ మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు పుట్టిల్లు అయిన చైనాను వదిలేసి , బ్రిటన్, అమెరికాలో తిష్ట వేసింది. భారత్‌లోనూ ఈ వైరస్ రోగుల సంఖ్య వేయి దాటినా.. 21రోజుల లాక్‌డౌన్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో లక్షా 40వేల మందికి పైగా దీని బారిన పడితే.. ఇటలీలో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లను కూడా బలి తీసుకుంటోంది. Also Read: కారణంగా ఇటలీలో ఇప్పటివరకు 10,779 మంది చనిపోయారు. మరణాల సంఖ్యలో ఆ దేశానిదే అగ్రస్థానం. అక్కడ కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో ఇప్పటివరకు 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్లు అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ తెలిపింది. Also Read: కరోనా పేషెంట్లకు చికిత్స చేసే సమయంలో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని సంస్థ ప్రెసిడెంట్ ఫిలిప్పో అనెల్లీ అభిప్రాయపడుతున్నారు. ఇటలీలో మొత్తం 7,100 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడినట్లు ఆయన తెలిపారు. ఇటలీలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన లాంబార్డీ ప్రాంతంలోనే 17 మంది డాక్టర్లు చనిపోయినట్లు సమాచారం. Also Read:
By March 30, 2020 at 10:47AM
No comments