Breaking News

19 ఏళ్లుగా లైంగికంగా వాడుకుని.. మరో యువతితో వివాహం


పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను 19ఏళ్లుగా లైంగికంగా వాడుకుని.. మోజు తీరాక మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజినీరుగా పనిచేస్తున్న మహిళ(35).. 19 ఏళ్ల క్రితం కానూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ చదువుకుంది. ఆ సమయంలో అక్కడే ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పట్నాల శ్రీరామచంద్రమూర్తితో ఈమెకు పరిచయం ఏర్పడింది. Also Read: ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీరామచంద్రమూర్తి లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాడు. చదువు తర్వాత చెన్నైలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా చెన్నై వెళ్లి ఆమెతో రాసలీలలు కొనసాగించేవాడు. పెళ్లి విషయం ఎత్తితే మాత్రం మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. Also Read: ఈ క్రమంలోనే ఆమెకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల తెలుసుకున్న బాధితురాలు శ్రీరామచంద్రమూర్తితో పాటు అతడి తల్లిదండ్రులను నిలదీయగా కులం పేరుతో దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శ్రీరామచంద్రమూర్తితో పాటు అతడి తల్లిదండ్రుల పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By March 10, 2020 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/penamaluru-man-booked-over-cheating-of-woman-for-pretext-of-marriage/articleshow/74561110.cms

No comments