Breaking News

బీరు సీసాతో బెదిరించి 12ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్


తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలో 12ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేట్టుపాళెయం ప్రాంతానికి చెందిన బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఇంట్లో మరుగుదొడ్డి వసతి లేకపోవడంతో ఈ నెల 7వ తేదీ రాత్రి ఇంటి సమీపంలో ఉన్న పాలారు నది ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లింది. Also read: ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన చంద్రు, పార్థిభన్‌, కన్నన్‌లు మద్యం తాగుతుండగా బాలిక కనిపించింది. ముగ్గురు యువకులు బాలికను వెంబడించి ముళ్లపొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. దీంతో వారు బీరు సీసా పగులగొట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మాకర స్థితికి చేరుకున్న బాధితురాలిని అక్కడే నగ్నంగా వదిలేసి పరారయ్యారు. Also read: కొద్దిసేపటి తర్వాత మేలుకున్న బాలిక శ్మశానంలో కనిపించిన వస్త్రాన్ని కప్పుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో వారు వెంటనే వాణియంబాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also read:


By March 10, 2020 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/12-yr-old-girl-gang-raped-by-3-men-in-tamil-nadu/articleshow/74560872.cms

No comments