ఇతనే నా బాయ్‌ఫ్రెండ్ అంటున్న ‘rx100’ భామ
మొత్తానికి టాలీవుడ్ భామ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టేసారు. కొన్ని నెలల క్రితం పాయల్ ఓ వ్యక్తితో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అతనే పాయల్ ప్రియుడు అయివుంటాడని చాలా మందికి సందేహం కలిగింది. ఈ నేపథ్యంలో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేయాలని అనుకుంది. ఇతని పేరు సౌరభ్ డింగ్రా. ఇతను ముంబయికి చెందిన మోడల్. చాలా కాలంగా సౌరభ్‌తో పాయల్ డేటింగ్‌లో ఉంది. ఈరోజు సౌరభ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతనితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నాలోని లోపాలను ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిన్ను మించి నాకెవ్వరూ అపురూపం కాదు. నీతో కలిసి గడిపిన ప్రతీ క్షణాన్ని ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకుంటాను. హ్యాపీ బర్త్‌డే మేరే జాన్’ అని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. పాయల్ కోసం సౌరభ్ సినిమా సెట్స్‌కి కూడా వస్తుంటాడట. సెట్స్‌కు రాగానే నేరుగా పాయల్ క్యారవ్యాన్‌లోకి వెళ్లపోతాడట. పాయల్ తనకు సంబంధించిన షూటింగ్ పూర్తైపోగానే సౌరభ్‌తో క్యారవ్యాన్‌తో కబుర్లు చెప్తూ కూర్చుంటుందట. ఇక పాయల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల పాయల్ నటించిన ‘డిస్కో రాజా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదనే చెప్పాలి. READ ALSO: ఇందులో పాయల్ మూగ అమ్మాయి పాత్రలో నటించింది. ప్రస్తుతం పాయల్ ఏంజెల్ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఎలాంటి అవకాశాలు లేవు. అదీకాకుండా కుర్ర హీరోలతో నటించకూడదని, పెద్ద హీరోలతోనే నటించాలని నియమం పెట్టుకున్నారట. వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’, రవితేజతో కలిసి నటించిన ‘డిస్కో రాజా’ పాయల్‌కు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. దాంతో పెద్ద హీరోలతో కలిసి నటిస్తే పేరుకు పేరు అవకాశాలూ వచ్చి పడతాయని పాయల్ నిర్ణయించుకున్నారట.
By February 13, 2020 at 09:19AM
No comments