Pawan Kalyan: ‘‘దయచేసి పవన్ సినిమాను అలా తీయొద్దు.. కావాలంటే నేను సలహాలిస్తా’’
పవర్‌స్టార్ ఓ మంచి కాన్సెప్ట్‌తో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. అయితే ఈ సినిమాను ‘పింక్’లాగా కేవలం డైలాగులతో, సంభాషణలతో తీయొద్దని సలహా ఇస్తున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అవసరమైతే సినిమాకు కావాల్సిన సలహాలు తాను ఇస్తానని అంటున్నారు. ‘‘ముందుగా లాయర్లకు ఓ నమస్కారం. పింక్ సినిమా చూశాక నాకు చిరంజీవి చేసిన న్యాయం కావాలి సినిమా గుర్తొచ్చింది. పింక్ సినిమా మొత్తం 80 శాతం కోర్టు సీనే ఉంటుంది. అయితే పింక్ సినిమా మొత్తం సంభాషణలతోనే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ రీమేక్‌లో నటిస్తున్నారు కాబట్టి కేవలం సంభాషణలు కాకుండా మంచి సన్నివేశాలు కూడా ఉండాలి. ఎందుకంటే సన్నివేశాలను ఎక్కువగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు కానీ కేవలం డైలాగులను ఎంజాయ్ చేయరు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి సినిమాను కేవలం డైలాగులతో నడిపించేస్తే ఫ్యాన్స్‌కి రుచించదు’’ READ ALSO: ‘‘నేను ‘వెంకీ మామ’ సినిమాలో కొన్ని మార్పులు చెప్పడంతో సురేష్ బాబు వాటిని వాడుకున్నారు. కావాలంటే పవన్ సినిమాకు కూడా ఏవన్నా మార్పులు కావాలంటే చెప్తాను. అయితే ‘పింక్’, ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాల్లో చూపించినట్లుగా పవన్ సినిమాను కూడా తెరకెక్కిస్తే పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే పవన్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేస్తున్నారంటే మంచి మెసేజ్‌తో పాటు పవన్‌కు తగ్గ స్టైల్ కూడా సినిమాలో కనిపించాలి. నేను ‘పింక్’ సినిమాతో పాటు దీనికి తమిళ వెర్షన్ అయిన ‘నేర్కొండ పార్వాయ్’ సినిమా కూడా చూశాను. రెండింట్లో ఓ కీలక పాయింట్ వదిలేశారు’’ ‘‘ఓ అమ్మాయిని కిడ్నా్ప్ చేసి తీసుకెళ్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సీసీ కెమెరాల సాయం కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ సన్నివేశాన్ని పవన్ సినిమాలో వాడి దానిని ఆయన స్టైల్‌కు తగ్గట్టుగా పోలీసులు నిర్లక్ష్యాన్ని కోర్టులో పవన్ లాయర్ గెటప్‌లో వారించినట్లైతే జనాలు ఏ రేంజ్‌లో విజిల్స్ వేస్తారో నాకు అర్థమైపోతోంది. సినిమా మొదట్లో పవన్ హీరోయిన్‌తో రొమాన్స్, కొన్ని పాటలు అలా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ నడిపిస్తే మళ్లీ పవన్ సినిమానే చూస్తున్నట్లు అనిపిస్తుంది’’ అని తెలిపారు.
By February 08, 2020 at 09:50AM
No comments