Breaking News

కరోనా భయంతో నిలిపివేసిన నౌకలో చాలా మంది భారతీయులు


భయంతో యకహోమా తీరంలో నిలిచిపోయిన నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో ఆరుగురు భారతీయులు చిక్కుకున్నారు. సిబ్బందితో కలిపి మొత్తం 3,700 మంది ఈ నౌకలో ఉన్నారు. నౌకలోని 61 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. వీరిని ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఫిబ్రవరి 19 వరకు నౌక దిగ్బంధం కొనసాగుతుందని డైమండ్ ప్రిన్సెస్ ఆపరేటర్ పేర్కొన్నారు. నౌకలోని 61 మంది నమూనాల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వీరిలో భారతీయుల ఎవ్వరూ లేరన్నారు. వీరిని వీలైనంత త్వరగా హాస్పిటల్స్‌కు తరలించనున్నట్టు తెలిపారు. చైనా వెలుపల కరోనా వైరస్ బాధితుల సంఖ్య అత్యధికంగా ఈ నౌకలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. నౌకలోని అందరి రక్త నమూనా పరీక్షలు నిర్వహించగా, ఇవి చివరి దశకు చేరుకున్నట్టు జపాన్ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. జపాన్ ప్రభుత్వం నౌకను, సహాయం కోసం అదనంగా సిబ్బందిని కేటాయించిందని తెలిపారు. జపాన్‌ తీరంలో చిక్కుకున్న డైమండ్ ప్రిన్సెస్‌లో భారతీయ సిబ్బంది, ప్రయాణికులు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘కరోనా వైరస్ కారణంగా యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్స్ నౌకలో చాలా మంది సిబ్బంది భారతీయులేనని, ప్రయాణికుల్లో కొందరు భారతీయులు ఉన్నారు.. టోక్యోలని భారత రాయబార కార్యాలయం తాజా సమాచారం ప్రకారం.. వీరిలో ఎవరికీ కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదు.. పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’అని ట్వీట్ చేశారు. ఈ నౌకలో జనవరి 25న హాంకాంగ్‌కు చెందిన ఓ 80ఏళ్ల వృద్ధుడు ప్రయాణించగా, ఐదు రోజుల తర్వాత ఆయనకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఓడను యకహోమా తీరంలో నిలిపివేశారు. తొలి విడత పరీక్షల్లో 20 మందిలో కరోనా వైరస్ నిర్ధారణ కాగా, తర్వాత 41 మందిలో వైరస్ బయటపడింది.


By February 08, 2020 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-least-six-indian-passengers-and-many-crew-members-on-board-ship-quarantined-in-japan/articleshow/74022150.cms

No comments