Breaking News

కూలిపని కోసం తీసుకెళ్లి వివాహితపై రేప్.. కోరిక తీర్చాలంటూ మళ్లీ వేధింపులు


కూలీపని కోసం తీసుకెళ్లి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ గౌలిపురాకు చెందిన ఓ వివాహిత(23) భర్తతో పాటు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. రాంసింగ్‌బాడాలో నివసించే బీదర్‌కు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు శివ(28) ఆమెను అప్పుడప్పుడూ పనికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 4న ఆమె ఇంటికి వచ్చి పని ఉందని చెప్పి బైకుపై సుల్తాన్‌షాహీలోని తన మిత్రుడు బస్వరాజ్‌(30) ఇంటికి తీసుకువెళ్లాడు. Also Read: ఆమెను గదిలోకి తీసుకెళ్లిన శివ బెదిరించి అత్యాచారానికి పాల్పడగా బస్వరాజ్ బయట కాపలాగా ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి గౌలిపురా శిశుమందిర్‌ పాఠశాల వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనను ఆసరాగా తీసుకున్న బస్వరాజ్ మరుసటి రోజు బాధితురాలి ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. లేనిపక్షంలో శివతో గడిపిన విషయాన్ని నీ భర్తకు చెబుతానని బెదిరించాడు. Also Read: దీంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. భర్త గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు శివ, బస్వరాజ్‌లపై అట్రాసిటీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. Also Read:


By February 07, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/case-booked-on-two-men-over-raped-on-married-woman-in-hyderabad/articleshow/73998455.cms

No comments